హైదరాబాద్ ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్
- బెదిరింపుకు పాల్పడిన నిందితుడి అరెస్ట్
- ఐటీ శాఖ అధికంగా పన్నులు వసూలు చేస్తోందని భావించిన నిందితుడు
- వారి నుండి డబ్బులు వసూలు చేయాలని ఫేక్ కాల్ పథకం
ఆ బాంబు పేలకుండా ఉండాలంటే తనకు రూ.1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సమాచారం బాంబు స్క్వాడ్ కు చేరవేయడంతో వారు తనిఖీలు చేశారు. ఉద్యోగులను కార్యాలయం నుండి బయటకు పంపించి పూర్తిగా గాలించారు. ఎక్కడా బాంబు కనిపించలేదు. ఆకతాయి పనిగా భావించిన పోలీసులు దానిని ఫేక్ కాల్ గా తేల్చారు. ఫోన్ కాల్ ఆధారంగా దర్యాఫ్తు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.