తెలంగాణలో నేడు, రేపు వడగాలులు.. ఇంట్లోనే ఉండాలంటూ వైద్యుల సూచన
- ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- సోమవారం రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం
- మంచినీళ్లతో పాటు మజ్జిగ, లస్సీ, నిమ్మరసం తాగాలని సూచన
ఎండల తీవ్రత ఎక్కువగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉంటుందని ఐఎండీ అధికారులు తెలిపారు.
పగటిపూట బయటకు వెళ్లాల్సి వస్తే.. తలకు తప్పనిసరిగా క్లాత్ చుట్టుకోవాలని, గొడుగు తీసుకెళ్లాలని, దాహం వేయకున్నా తరచూ నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ కు గురికాకుండా జాగ్రత్తపడాలని వైద్యులు సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులు, చిన్నారులు ఇంట్లోనే ఉండడం ఉత్తమం. కూల్ డ్రింకుల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే మజ్జిగ, లస్సీ, నిమ్మరసం తయారుచేసుకుని తరచూ తాగాలని చెప్పారు.