జగన్ బ్రాండ్‌లను తరిమి కొడతాం: మద్యంపై నారా లోకేశ్
- వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయని విమర్శ
- టీడీపీ హయాంలోనే రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం జరిగిందన్న టీడీపీ యువనేత
- యానాదులకు పలు హామీలు
పాదయాత్ర సందర్భంగా ఆయన యానాదులతో మాట్లాడారు. యానాదుల జీవితమంతా కష్టపడుతూనే ఉంటారని, వారి కోసం టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. జగన్ ప్రభుత్వం రాగానే యానాదుల సంక్షేమ పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే యానాదులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అలాగే ఈ ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. యానాదులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. కమ్యూనిటీ భవనాలు కట్టిస్తామని చెప్పారు.