West Bengal: వినూత్న నిరసన.. 22 కిలోమీటర్లు పరిగెత్తికెళ్లి ఎన్నికల నామినేషన్ దాఖలు

Bengal Man runs 22 kilometers to submit nomination papers as a mark of protest
షార్ట్స్‌లో చూడండి
తన గ్రామంలో అభివృద్ధి లేక విసిగిపోయిన ఓ వ్యక్తి వినూత్న శైలిలో నిరసన తెలిపాడు. దాదాపు 22 కిలోమీటర్ల దూరం పరిగెత్తికెళ్లి పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశాడు. బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా సొనాడ గ్రామంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. కొండ ప్రాంతంలో ఉన్న తమ ఊరిని ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదని స్థానిక యువకుడు సనారా సుభా ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.
Go Back to Shorts
West Bengal

More Telugu News