మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 9 మంది మృతి
- నెల రోజులుగా మణిపూర్‌లో ఘర్షణలు
- గత రాత్రి ఖమెన్‌లోక్ ప్రాంతంలో చెలరేగిన హింస
- మృతుల్లో మహిళ కూడా
మరణించిన వారిలో కొందరి శరీరాలపై కోసిన గాయాలు ఉండగా, మరికొందరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కర్ఫ్యూ సడలింపు తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నెల రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కేంద్రరాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.