చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు చికెన్, మటన్ బంద్

non veg food delivery stopped in chanchal guda charlapally jails for lack of funds
  • బడ్జెట్ విడుదల కాకపోవడంతో నిధులకు కటకట
  • మాంసాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు జైళ్లు రూ.2 కోట్ల మేరకు బాకీ
  • రెండు వారాలుగా మాంసాహారం సరఫరా నిలిచిపోయిన వైనం
  • పాలు, రేషన్, గ్యాస్ సరఫరాలోనూ సమస్యలు
చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో నిధులకు కటకట ఏర్పడటంతో ఖైదీలకు మాంసాహారం సరఫరా నిలిచిపోయింది. మహిళా కారాగారంలోనూ ఖైదీలకు రెండు వారాలుగా చికెన్, మటన్ ఇవ్వట్లేదు. మాంసాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు సుమారు రూ. 2 కోట్ల వరకూ బకాయి ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ విడుదల కాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. 

ఖైదీలకు మొదటి ఆదివారం మటన్, మిగిలిన ఆదివారాలు చికెన్ వడ్డిస్తారు. ఇదిలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో పాలు, రేషన్, గ్యాస్ సరఫరాలో కూడా సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Telangana

More Telugu News