రూ.10 అడిగాడని కుమారుడిని అంతమొందించిన తండ్రి
- ఝార్ఖండ్, ఛత్రాజిల్లా వశిష్టనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- సోమవారం ఉదయమే భార్యతో పాటూ మద్యం తాగిన నిందితుడు
- మద్యం మత్తులో ఉన్న భార్యాభర్తల మధ్య గొడవ
- అదే సమయంలో తండ్రిని రూ.10 అడిగిన బాలుడు
- విచక్షణ మరిచి కుమారుడిని గొంతు నులిమి చంపేసిన తండ్రి
అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న భూయాన్ విచక్షణ మరిచి కుమారుడిని గొంతు నులిమి ఉపిరాడకుండా చేసి పొట్టనపెట్టుకున్నాడు. అదే సమయంలో వారి కుమార్తె ఇసుకబట్టిలో తన పని ముగించుకుని ఇంటికి వచ్చింది. ఇంటికొచ్చాక తండ్రి చేసిన ఘోరం గురించి తెలిసి భయంతో పెద్దపెట్టున కేకలు వేసింది. దీంతో, అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.