పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి మరోసారి ఊరట!
- 2019 ఎన్నికల సమయంలో మోదీ ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యల అంశం
- కోర్టు హాజరు నుండి మినహాయింపుపై పొడిగింపు
- ఆగస్ట్ 2 వరకు ప్రత్యక్ష హాజరు నుండి మినహాయింపును ఇచ్చిన న్యాయస్థానం
దీనిపై విచారణకు రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ గతంలో స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ రాహుల్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్వీ కొత్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా హాజరు మినహాయింపును న్యాయస్థానం మరోసారి పొడిగించింది.