Mahi V Raghav: 'సైతాన్' చూడాలా? వద్దా? అనేది ఆడియన్స్ ఛాయిస్: డైరెక్టర్ మహి వి రాఘవ్

Shaitan Web Series Update
షార్ట్స్‌లో చూడండి
'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో మరో తెలుగు వెబ్ సిరీస్ రానుంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'సైతాన్'. టైటిల్ తోనే ఈ వెబ్ సిరీస్ ఒక్కసారిగా ఆసక్తిని రేకెత్తించింది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూసినవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందుకు కారణం ఈ ట్రైలర్లో కనిపించిన హింస నేపథ్యంలోని సన్నివేశాలు, అశ్లీలత .. అసభ్యతగా అనిపించే సంభాషణలు. దాంతో ఒక తెలుగు వెబ్ సిరీస్ లో ఈ స్థాయి విపరీత దృశ్యాలా? అంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. మోతాదు మించిన దృశ్యాల పట్ల చాలామంది అసహనాన్ని ప్రదర్శించారు. 

ఈ నేపథ్యంలో మహి వి రాఘవ్ స్పందించాడు. "ఇది వల్గర్ వెబ్ సిరీస్ కాదు .. క్రైమ్ వరల్డ్ ను బేస్ చేసుకుని నడిచే కథ. అందువలన ఆ మాత్రం ఘాటైన దృశ్యాలు .. డైలాగ్స్ ఉంటాయి. ఈ కంటెంట్ ఎలాంటిది అనే విషయంలో ముందునుంచే మేము హెచ్చరికలు చేస్తూనే వస్తున్నాము. పోస్టర్స్ ద్వారా ... ట్రైలర్ ద్వారా ఇది ఎలాంటి వెబ్ సిరీస్ అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేశాము. కనుక దీనిని చూడాలా? లేదా? అనేది ఆడియన్స్ యొక్క వ్యక్తిగతమైన ఛాయిస్" అని చెప్పుకొచ్చాడు. 

Go Back to Shorts
Mahi V Raghav
Director
Shaitan Web Series

More Telugu News