ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనంటున్న గూగుల్
- కరోనా సంక్షోభం సమయంలో వర్క్ ఫ్రం హోం బాట పట్టిన కంపెనీలు
- ముగిసిన సంక్షోభం... తెరుచుకున్న కార్యాలయాలు
- వర్క్ పాలసీని అప్ డేట్ చేసిన గూగుల్
- నిబంధన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక
కొందరు ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం విధానానికే మొగ్గు చూపడంతో గూగుల్ వంటి సంస్థలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని గూగుల్ స్పష్టం చేసింది. ఈ నిబంధనను అంగీకరించని ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని గూగుల్ హెచ్చరించింది. ఈ నిబంధన పాటించని ఉద్యోగుల పనితీరుకు తక్కువ గ్రేడింగ్ ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు తన నూతన వర్క్ పాలసీని గూగుల్ ప్రకటించింది.
హాజరు విషయంలో తాము రాజీపడబోమని గూగుల్ సీపీవో ఫియోనా సిక్కోనీ స్పష్టం చేశారు. ఆఫీసులకు దగ్గరగా నివసిస్తున్న ఉద్యోగులు ఈ నిబంధన తప్పక పాటించాలని సూచించారు.