నిరాడంబరంగా... ఇంటి వద్దే నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం
- ఢిల్లీలోని నిర్మల నివాసంలో ఒక్కటైన పరకాల వాంగ్మయి-ప్రతీక్
- కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి
- పెళ్లి సమయంలో తీసిన 'సింప్లిసిటీ' ఫోటోలు వైరల్
ఈ ప్రత్యేక కార్యక్రమానికి వధువు గులాబీ రంగు చీరను ఆకుపచ్చ బ్లౌజ్ తో ధరించింది. వరుడు తెల్లని పంచె, శాలువా ధరించాడు. వధువు తల్లి నిర్మలా సీతారామన్ మొలకాల్మూరు చీరను ధరించారు. పెళ్లి సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.