'సైతాన్' ట్రైలర్ ను కూడా ఎవరి రూమ్ లో వాళ్లు చూడవలసిందే!

Shaitan Webseries
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'సైతాన్'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన తెలుగు సిరీస్ 
  •  ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్
  • అభ్యంతరకర సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్  
సాధారణంగా హారర్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో నడిచే సినిమాలను చూడాలంటే, నలుగురితో కలిసి చూడటం జరుగుతూ ఉంటుంది. కాస్త భయం ఉన్నవాళ్లు ఇలా చేస్తుంటారు. ఇక ఇంట్లో వెబ్ సిరీస్ ను చూడాలనుకునేవారు, తప్పకుండా తమ చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసుకోవలసిందే. తమ వెబ్ సిరీస్ ను ఎవరికి వారు తమ రూమ్ లో కూర్చుని చూడటమే బెటర్ అంటూ చెప్పేస్తున్నారు కూడా.

 అలాంటి వెబ్ సిరీస్ ఒకటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'సైతాన్'. మహి వి రాఘవ్ ఈ వెబ్ సిరీస్ ను రూపొందించగా, దేవియాని శర్మ .. జాఫర్ సాధిక్ .. రిషి .. షెల్లీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది ఒక సైకో కిల్లర్ నేపథ్యంలో సాగే కథ అనే విషయం తెలుస్తోంది. హింసతో కూడుకున్న సన్నివేశాలతో పాటు, అభ్యంతరకరమైన సంభాషణలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఓటీటీ  వైపు నుంచి ఈ తెలుగు వెబ్ సిరీస్ ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. 
Advertisement
Deviyani
Jafar
Rishi
Shelly

More Telugu News