క్రికెటర్ ధోనీ ఆస్తులు ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే!
- ఒక అంచనా ప్రకారం రూ.1,040 కోట్ల సంపద పరుడు ధోనీ
- గరుడ ఏరోస్పేస్, కార్స్ 24 తదితర కంపెనీల్లో పెట్టుబడులు
- స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో వాటాలు
- ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్
ఎంఎస్ ధోనీకి రూ.1,040 కోట్ల విలువైన ఆస్తులు ఉంటాయని అంచనా. చెన్నై జట్టు సారథిగా ఒక సీజన్ కు ధోనీ రూ.12 కోట్లు తీసుకుంటాడు. పలు స్టార్టప్ లు, కంపెనీల్లోనూ ధోనీకి పెట్టుబడులు ఉన్నాయి. ఖాతాబుక్, కార్స్24, శాకాహారి, గరుడ ఏరోస్పేస్ (డ్రోన్ల కంపెనీ)లో పెట్టుబడులు ఉన్నాయి. ఫిట్ నెస్, లైఫ్ స్టయిల్ బ్రాండ్ సెవెన్ లోనూ మెజారిటీ వాటాలున్నాయి. కోకకోలా, ఇండియా సిమెంట్స్, డ్రీమ్ 11, గోడాడీ, రీబాక్, స్వరాజ్ ట్రాక్టర్స్ ఇలా ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారంలో పాల్గొంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నాడు.
అలాగే, ఫుట్ బాల్ జట్టు చెన్నియన్ ఎఫ్ సీ, హాకీ జట్టు రాంచీ రేస్, మహీ రేసింగ్ టీమ్ ఇండియా ఫ్రాంచైజీల్లోనూ ధోనీకి పెట్టుబడులు ఉన్నాయి. ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ సినిమా కోసం రూ.30 కోట్లు పుచ్చుకున్నాడు. ధోనీ ఆటగాడే కాదు, సిరిమంతుడని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.