కన్నడ సినీ పరిశ్రమలో విషాదం.. యువనటుడు నితిన్ గోపి మృతి
- గుండెపోటుతో మృతి చెందిన నితిన్ గోపి
- చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన నితిన్
- నితిన్ వయసు 39 ఏళ్లు
నితిన్ మరణంతో శాండల్ వుడ్ షాక్ కు గురైంది. నితిన్ తన తల్లిదండ్రులతో కలసి బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన నితిన్ పలు చిత్రాల్లో నటించాడు. సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశాడు. ఒక కొత్త సీరియల్ కు దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతుండగా విషాదం చోటు చేసుకుంది.