Leonardo DiCaprio: 'టైటానిక్' హీరో డికాప్రియోతో ఇండియన్ మోడల్ నీలమ్ గిల్ డేటింగ్.. ఆమె గురించిన పూర్తి వివరాలు ఇవిగో!

Neelam Gill dating with Leonardo DiCaprio
  • నీలమ్ బ్రిటీష్ - పంజాబీ మోడల్
  • 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన నీలమ్
  • 2022లో మూడో భార్య నుంచి విడిపోయిన డికాప్రియో
భారత సంతతి మోడల్ నీలమ్ గిల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 'టైటానిక్' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోతో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. డికాప్రియో వయసు 58 ఏళ్లు కాగా, నీలమ్ వయసు 28 సంవత్సరాలు. 

నీలమ్ గిల్ గురించి కొన్ని వివరాలు:
నీలమ్ బ్రిటీష్-పంజాబీ మోడల్. 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటుంది. ఇటీవల ఆమె ఇండియాకు వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ నిర్వహిస్తున్న నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె విచ్చేసింది. 

మరోవైపు డికాప్రియో ప్రియురాళ్ల జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. తన జీవితంలో ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. చాలా మందితో డేటింగ్ చేశాడు. చివరగా మోడల్, నటి కామిల్లాతో నాలుగేళ్ల పాటు కలిసుండి 2022లో విడిపోయాడు. ఇప్పుడు నీలమ్ తో డేటింగ్ లో ఉన్నాడు.
Leonardo DiCaprio
Neelam Gill
Hollywood
Dating

More Telugu News