Rishi: 'సైతాన్' వెబ్ సిరీస్ కూడా అలా చూడవలసిందేనట!

Shaitan Webseries Streaming date confirmed
షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో సస్పెన్స్ .. హారర్ .. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. ఈ తరహా కంటెంట్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతూపోతోంది. అందువల్లనే ఆ తరహా కంటెంట్ కి మేకర్స్ ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నారు. అలా ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'సైతాన్'. 
 
మహి వి రాఘవ్ రచన .. దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. 'బాలి' అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. 'బాలి' ఫ్యామిలీకి ఈ సమాజంలోని కొంతమంది వ్యక్తుల వలన అన్యాయం జరుగుతుంది. అప్పుడు ఆ ఫ్యామిలీ ఏం చేస్తుంది? ఆ తరువాత చోటుచేసుకునే ఆసక్తికరమైన పరిణామాలు ఏమిటి? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది. 

రిషి .. షెల్లీ .. దేవయాని ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, జూన్ 15వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కథ ప్రకారం ఈ వెబ్ సిరీస్ లో వైలెన్స్ .. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అందువలన ఈ వెబ్ సిరీస్ ను కొన్ని జాగ్రత్తలు తీసుకునే చూడాలనే టాక్ వినిపిస్తోంది. అంటే అందరితో కలిసి హాల్లో కాకుండా, ఎవరి గదిలో వాళ్లు చూడటం బెటరన్నమాట.
Go Back to Shorts
Rishi
Shelly
Devayani
Shaitan Webseries

More Telugu News