వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
- అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు
- బ్రిడ్జిపై నుంచి జారిపడి లోయలో పడిన బస్సు
- మరో 20 మందికి గాయాలు
ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. స్థానికులతో కలిసి సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు జమ్మూ సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు. క్షతగాత్రులను జమ్మూలోని జీఎంసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.