KCR: కుల వృత్తులకు రూ.1 లక్ష చొప్పున సాయం... కేసీఆర్ శుభవార్త!

  • కులవృత్తుల ఆధారంగా జీవించే వారిని ఆదుకుంటామన్న సీఎం
  • సహాయానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తామన్న మంత్రి
  • త్వరితగతిన విధి విధానాలు ఖరారు చేయాలని కేసీఆర్ ఆదేశాలు
Telangana CM KCR to give RS 1 lakh to people

కులవృత్తులే ఆధారంగా జీవించే వారిని ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాల్లో కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. రూ.1 లక్ష చొప్పున దశల వారీగా ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

సహాయం ప్రకటిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అమలు విధివిధానాలను మరో రెండ్రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ చైర్మన్‌, మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యమంత్రికి తెలిపారు. త్వరితగతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

More Telugu News