Rain: ఐపీఎల్ ఫైనల్లో చెన్నై ఛేజింగ్... తొలి ఓవర్లోనే వాన పోటు

  • అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్
  • తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు
  • లక్ష్యఛేదనకు బరిలో దిగిన సీఎస్కే
  • 3 బంతులు ఆడగానే వాన రాక... నిలిచిన మ్యాచ్
Rain interrupts IPL final between Gujarat Titans and Chennai Super Kings

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను వరుణుడు వీడేట్టు కనిపించడంలేదు. అహ్మదాబాద్ లో నిన్న భారీ వర్షం పడడంతో మ్యాచ్ నేటికి వాయిదా పడడం తెలిసిందే. అయితే, ఇవాళ గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసేంతవరకు ఓపికపట్టిన వరుణుడు... చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా తొలి ఓవర్లోనే ప్రత్యక్షమయ్యాడు. గుజరాత్ టైటాన్స్ ఆ ఓవర్లో 3 బంతులు విసరగా, సీఎస్కే 4 పరుగులు చేసింది. వాన జోరు చూస్తే మ్యాచ్ ఇప్పట్లో మళ్లీ మొదలయ్యేట్టు కనిపించడంలేదు. పిచ్ ను, సర్కిల్ ప్రాంతాన్ని కవర్లతో కప్పేశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నైసూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ 47 బంతుల్లోనే 96 పరుగులు చేయడం గుజరాత్ ఇన్నింగ్స్ లో హైలైట్.

More Telugu News