సయోధ్య కుదిరేనా? .. కాంగ్రెస్ చీఫ్ ను కలవనున్న గెహ్లాట్, సచిన్ పైలట్
- రాజస్థాన్ కాంగ్రెస్ లో గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు
- ఈ ఏడాది చివరలో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు
- ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చేందుకు సమావేశం నిర్వహిస్తున్న ఖర్గే
గత వసుంధరా రాజే ప్రభుత్వంలో చోటు చేసుకున్న కుంభకోణాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలనేది పైలట్ మూడు డిమాండ్లలో ఒకటి. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలను మొదలుపెట్టింది. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య సయోధ్యను కుదిర్చిన ఫార్ములానే ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తోంది.