నిలకడగా అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్యం.. ఏఐజీ ఆసుపత్రి హెల్త్‌ బులెటిన్ విడుదల

AIG hospital releases health bulletin over Avinash reddys mother lakshmamma
  • అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మకు కట్టింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ నిర్వహించామన్న ఏఐజీ ఆసుపత్రి వైద్యులు
  • ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
  • శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
వివేకానంద హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి తల్లి లక్ష్మమ్మ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమెకు కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించినట్టు వైద్యులు వెల్లడించారు. 

లక్ష్మమ్మకు కట్టింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీతో పాటు కుడి గుండె కవాటంలో స్టంట్ అమర్చినట్టు చెప్పారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. లక్ష్మమ్మను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
YS Avinash Reddy

More Telugu News