అల్లర్ల ఎఫెక్ట్.. మణిపూర్ లో రూ.1800 లకు చేరిన వంట గ్యాస్ ధర
- రిజర్వేషన్లపై రాష్ట్రంలో చెలరేగిన హింస
- నిలిచి పోయిన ట్రాన్స్ పోర్ట్ సేవలు
- ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు
పంపిణీ నిలిచిపోవడంతో అందుబాటులో ఉన్న సరుకుల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు. బియ్యం, ఉల్లిగడ్డ, బంగాళదుంప, కోడిగుడ్ల రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇంఫాల్ తూర్పు, పశ్చిమ లోయతో పాటు అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో బియ్యం ధర 50 కిలోలకు రూ.1800 లకు చేరింది. గతంలో ఇది రూ.900 లు ఉండేదని ప్రజలు చెబుతున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో సిలిండర్ ధర రూ.1800లకు పైకి చేరిందని వాపోయారు. ఇంఫాల్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.170 కి చేరింది. కోడిగుడ్ల ధర ఒక్కొక్కటి రూ.10 కి చేరిందని, కిలో బంగాళదుంప రూ.100కు చేరిందని ఇంఫాల్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.