ఊళ్లోకి వచ్చిన సింహాలను పరుగులు తీయించిన ఎద్దు... వీడియో వైరల్
- గుజరాత్ లోని జునాగఢ్ లో ఊళ్లోకి ప్రవేశించిన సింహాలు
- ఎద్దు తరుముకుని రావడంతో భయంతో దౌడు తీసిన వైనం
- సీసీ కెమెరాల్లో రికార్డయిన ఘటన
ఆ విధంగానే ఓ సింహాల గుంపు జునాగఢ్ లోకి ప్రవేశించింది. ఎంతో ఠీవిగా నడుచుకుంటూ వస్తున్న ఆ సింహాలు ఉన్నట్టుండి వెనుదిరిగి పరుగు లంకించుకున్నాయి. ఏంటని చూస్తే... విపరీతమైన ఆవేశంతో దూసుకువచ్చిన ఓ ఎద్దు ఆ సింహాలను దౌడు తీయించింది. ఎద్దు దెబ్బకు ఆ సింహాలు చెల్లాచెదురయ్యాయి.
ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. అంతేకాదు, ఆరుబయట నిద్రిస్తున్న ఓ వ్యక్తి కూడా ఈ వ్యవహారాన్ని తన సెల్ ఫోన్ లో బంధించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.