హైదరాబాద్‌కు మరో ‘వందేభారత్’.. ఈసారి నాగ్‌పూర్ వరకు!
- హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు
- హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య మూడో రైలు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే
- కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు మధ్య రైళ్లకు ప్రతిపాదనలు
కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు వంటి పట్టణాలకు వందేభారత్ రైళ్లు నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్ విద్యావ్యాపార, ఐటీల కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. దీంతో దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోందని అధికారులు పేర్కొన్నారు.