మల్టీస్టారర్‌లో బాలకృష్ణ.. రెండు భాగాలుగా సినిమా!
- కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌తో కలిసి నటించనున్న బాలయ్య
- రెండో భాగంలో మరో స్టార్ బరిలోకి
- రజనీకాంత్, కమలహాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ పేర్ల పరిశీలన
రజనీకాంత్ డేట్స్ కుదరకుంటే కమల హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌లో ఒకరిని తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శివరాజ్‌కుమార్ సొంత బ్యానర్‌లో మరో ఇద్దరు కన్నడ నిర్మాతలతో కలిసి నిర్మిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎన్‌బీకే108’ వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు. దసరాను పురస్కరించుకుని ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య మల్టీస్టారర్ ఈ సినిమా తర్వాతే ఉంటుందా? లేదంటే మధ్యలో మరో సినిమా ఉంటుందా? అన్న విషయంలో స్పష్టత లేదు.