ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు నిరసన.. కేన్స్‌లో ఒంటిపై రక్తపు రంగుతో రెడ్‌కార్పెట్‌పై నడిచిన మహిళ!
- ‘యాసిడ్’ చిత్రబృందం ఫొటోలకు పోజులిస్తుండగా ఘటన
- మహిళను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది
- గతేడాది కూడా ఇలాంటి ఘటనే
‘యాసిడ్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆదివారం చిత్ర బృందం రెడ్‌కార్పెట్‌పై ఫొటోలకు పోజులిచ్చింది. అదే సమయంలో ఉక్రెయిన్ జాతీయ జెండా రంగులైన నీలం, పసుపు రంగుల దుస్తులో వచ్చిన ఓ మహిళ ఫొటోలకు పోజిచ్చింది. ఆ వెంటనే వెంట తెచ్చుకున్న ఎరుపు రంగును తలపై పోసుకుని శరీరమంతా రాసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఆ మహిళ ఎవరన్నదీ తెలియరాలేదు. అయితే, ఆమెను ఉక్రెయిన్ వాసిగా అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు నిరసనగానే ఆమె ఇలా చేసినట్టు తెలుస్తోంది. కాగా, గతేడాది కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇలాగే ఓ మహిళ అనూహ్యంగా నిరసన తెలిపి కలకలం రేపింది.