శ్వేతసౌధం వద్ద బీభత్సం సృష్టించిన ట్రక్
- సోమవారం రాత్రి ఘటన
- బారికేడ్లను ఢీకొట్టిన ట్రక్కు
- భద్రతా సిబ్బంది అదుపులో డ్రైవర్
- ఘటనపై దర్యాప్తు ప్రారంభం
బారికేడ్లను ట్రక్కు ఢీకొట్టిన తర్వాత ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లు, నడకదారులను మూసివేసినట్టు సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. అంతేకాదు, సమీపంలో ఉన్న హే ఆడమ్స్ హోటల్‌ను అధికారులు ఖాళీ చేయించినట్టు ‘ఫాక్స్ 5’ టెలివిజన్ న్యూస్ తెలిపింది. ట్రక్కు డోరును రిమోట్ రోబో సాయంతో తెరిచారు. అందులో అనుమానాస్పద వస్తువులు ఏవీ లేవని గుర్తించారు.