చేసిన తప్పులను .. పొందిన అవమానాలను గుర్తుపెట్టుకుంటాను: డైరెక్టర్ తేజ

Teja Interview
  • ఎవరేమనుకున్నా పట్టించుకోనన్న తేజ  
  • తన ఫ్లాపులను గురించి ఎక్కువగా మాట్లాడతానని వివరణ
  • గతంలో తన ఇల్లు జప్తులోకి వెళ్లిందని వెల్లడి
డైరెక్టర్ తేజ .. ముక్కుసూటి మనిషి. మనసులో ఏదైతే అనుకున్నారో బయటికి అది చెప్పేస్తూ ఉంటారు. అలా ఆయన ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అయినా తన తీరు మారదని చెబుతుంటారు ఆయన. తాజా ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ .. "నాకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువని అంటూ ఉంటారు. అసలు నా గురించి నేను ఆలోచించను .. అందువలన నా గురించి ఎవరేమనుకుంటున్నారనేది తెలుసుకోను .. ఒకవేళ తెలిసినా పట్టించుకోను" అన్నారు. 

"నేను నాలా ఉంటాను .. అది తిక్కా అనుకుంటే అనుకోండి. ఈ రోజున మీరు నన్ను తిట్టేసి మళ్లీ రేపు ఇంటర్వ్యూకి పిలిస్తే వచ్చేస్తాను. నేను నా హిట్స్ కంటే ఫ్లాపులను ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాను. చేసిన తప్పులను .. పొందిన అవమానాలను గుర్తుపెట్టుకుంటాను. అలా చేయడం వలన మరోసారి ఆ పొరపాటు చేయకుండా ఉంటామనేది నా నమ్మకం" అని అన్నారు. 

"ఒకసారి నేను మా ఇంటిని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నాను. ఆ తరువాత ఆర్థికపరమైన ఇబ్బందువల వలన కట్టలేకపోయాను. ఈ ఆస్తి బ్యాంకు జఫ్తులో ఉందని చెప్పి బ్యాంకు వారు నోటీస్ అంటించేసి వెళ్లిపోయారు. ఆ లోన్ తీర్చిన తరువాత కూడా నేను ఆ నోటీస్ తీయలేదు. ఎందుకంటే ఇంకోసారి లోన్ తీసుకోకూడదు అనే విషయం నాకు గుర్తుండటం కోసం" అని చెప్పుకొచ్చారు. 

Advertisement
Teja
Director
Tollywood

More Telugu News