గొడుగు తెరుచుకోక.. వానలో తడుస్తూ.. అమెరికా అధ్యక్షుడి వీడియో వైరల్

Biden struggles to open umbrella during japan visit
  • ఇటీవల జపాన్ పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
  • జపాన్‌లో లాండయ్యే సమయానికి చినుకులు మొదలు
  • విమానంలోంచి దిగుతూ బైడెన్ గొడుగు తెరిచే ప్రయత్నం
  • గొడుగు తెరుచుకోకుపోవడంతో ఇబ్బందులు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్లు, పొరపాట్లకు సంబంధించి గతంలో అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న మరో వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. గొడుగు తెరిచేందుకు ఇబ్బంది పడ్డ బైడెన్ వీడియో ఇది. ఇటీవల బైడెన్ జపాన్ పర్యటనకు వెళ్లారు. అయితే, ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే చినుకులు మొదలయ్యాయి. 

దీంతో, బైడెన్ విమానం దిగుతూ తన వద్ద ఉన్న పెద్ద గొడుగును తెరిచే ప్రయత్నం చేశారు. కానీ, అది ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఆయన దాన్ని అలాగే పట్టుకుని ఎదురుగా ఉన్న జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రికి అభివాదం చేశారు. ఈ క్రమంలో బైడెన్ వానలో కాస్తంత తడవాల్సి వచ్చింది. ఈలోపు, బైడెన్ ఇబ్బందిని గమనించిన అమెరికా అధికారులు తమవద్ద ఉన్న గొడుగును పట్టేప్రయత్నం చేస్తారు. ఆ తరువాత బైడెన్ మరోసారి ప్రయత్నించడంతో గొడుగు తెరుచుకుంది. కాగా, బైడెన్ వ్యతిరేకులు ఈ వీడియో సాకుగా మళ్లీ ఆయనపై ట్రోలింగ్‌కు దిగుతున్నారు. గొడుగు తెరిచేందుకు ఇంతసేపా అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 

Advertisement
Joe Biden
Japan

More Telugu News