'బ్రో' సెట్స్ పైకి పవన్ ఎంట్రీ అదిరింది... వీడియో ఇదిగో!
- పవన్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో బ్రో
- సముద్రఖని దర్శకత్వంలో చిత్రం
- పవన్ రాకతో సెట్స్ పై ఉత్సాహభరిత వాతావరణం
ఓ లగ్జరీ వాహనంలో సెట్స్ వద్దకు వచ్చిన పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికారు. లాల్చీ, పైజామా డ్రస్ లో ఉన్న పవన్ స్వయంగా వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు.
బ్రో చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం జులై 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.