KCR: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం: కేసీఆర్ ధీమా

KCR says BRS will win 95 seats in Telangana
  • దశాబ్దకాలంలో శతాబ్ది అభివృద్ధి చేశామన్న కేసీఆర్
  • రాష్ట్ర అభివృద్ధి వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచన
  • సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్దకాలంలో శతాబ్ది అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. సర్వేలు అన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ 95 స్థానాల నుంచి 105 స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు.
KCR

More Telugu News