Amitabh Bachchan: అమితాబ్, అనుష్కకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్లకు రూ.10 వేలకు పైగా జరిమానా!

Mumbai Police impose fine on riders for helmet rule violation
  • డబ్బింగ్ స్టూడియోకు త్వరగా చేరుకోవడానికి బైక్స్ మీద ప్రయాణించిన స్టార్స్
  • అమితాబ్, అనుష్కలు ఎక్కిన బైకర్స్ హెల్మెట్ ధరించలేదని ఫిర్యాదు
  • జరిమానా విధించినట్లు ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ముంబై పోలీస్
బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మలకు లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు బైకర్లకు జరిమానా పడింది. స్టార్స్ కు లిఫ్ట్ ఇచ్చిన వీరిద్దరు హెల్మెట్ ధరించలేదు. దీంతో వారికి ముంబై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆ బైకర్లకు జరిమానా విధించినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. అనుష్కకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి రూ.10,500 జరిమానా పడింది. అమితాబ్ ను తీసుకెళ్లిన వ్యక్తిపై ఎంత జరిమానా పడిందో తెలియరాలేదు.

ట్రాఫిక్ ను తప్పించుకొని అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకోవడానికి అమితాబ్, అనుష్కలు ఇటీవల తమ కారు దిగి, రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తుల బైక్‌పై ఎక్కారు. అమితాబ్, అనుష్కలు ఏ బైక్స్ అయితే ఎక్కారో.. ఆ బైక్స్ నడుపుతున్న వారు హెల్మెట్లు పెట్టుకోలేదు. వారు ఎక్కిన బైకర్స్ హెల్మెట్ ధరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో వారికి జరిమానా పడింది.
Amitabh Bachchan
Anushka Sharma
mumbai

More Telugu News