ఇవాళో రేపో కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన: రణ్‌దీప్ సుర్జేవాలా
- సిద్ధరామయ్యకే సీఎం పదవి ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచన
- డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశం
- రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం!
సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని సిద్ధూ వైపు మొగ్గు చూపుతున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం మాజీ ముఖ్యమంత్రికే ఆ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజో రేపో ప్రకటన వెలువడగానే గురువారం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. అయితే డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.