పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల దుర్మరణం

5 dead in road accident held in palnadu dist
  • మరో పదిమందికి తీవ్ర గాయాలు
  • పొందుగల వద్ద ఆటోను ఢీకొట్టిన లారీ
  • ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది కూలీలు
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్గొండ జిల్లాకు చెందిన వారే. గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా వీరి ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
Road Accident
Palnadu Dist
Nalgonda District

More Telugu News