సిద్ధరామయ్యవైపే ఎమ్మెల్యేల మొగ్గు!
- సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఎమ్మెల్యేలకు ఓటింగ్
- మాజీ ముఖ్యమంత్రికి 80 మంది ఎమ్మెల్యేల మద్దతు
- పోటీలో వెనకబడ్డ డీకే శివకుమార్
ఈ నేతలు ఇద్దరిలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నవారికే సీఎం పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకు ఓటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఓటింగ్ లో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్యే ముందుండగా.. ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ వెనకబడ్డట్లు సమాచారం. దీంతో కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.