Tirumala: తిరుమల వెంకన్నను దర్శించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

7 dead and 5 injured in an accident in YSR dist
షార్ట్స్‌లో చూడండి
వైఎస్సార్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులు కలిసి తుఫాన్ వాహనంలో తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. 

మార్గమధ్యంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో వైఎస్సార్ జిల్లా కొండాపూర్ మండలం ఏటూరు గ్రామ సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Tirumala
Tadipatri
Bellary
YSR Dist
Road Accident

More Telugu News