కర్ణాటక సీఎం ఎవరని ప్రశ్నిస్తే డీకే శివకుమార్ సమాధానం ఇదీ!

Dk shivakumar responds over the question of who would be karnataka cm
  • కర్ణాటక సీఎం పదవి విషయంలో డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • పని చేసిన చోట ప్రతిఫలం ఉంటుందని వ్యాఖ్య
  • శక్తే  తనని ఎన్నికల్లో నడిపించిందని కామెంట్
  • సీఎం ఎవరనేదానిపై అంతటి ఆసక్తి అవసరం లేదన్న డీకే
కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివ కుమార్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పని చేసిన చోట ప్రతిఫలం ఉంటుందని మీడియాతో వ్యాఖ్యానించిన ఆయన.. సీఎం ఎవరనేదానిపై టెన్షన్ అవసరం లేదని కూడా కామెంట్ చేశారు. భక్తి ఉన్న చోట భగవంతుడు ఉంటాడని వ్యాఖ్యానించిన ఆయన.. శక్తే తనను నడిపించిందని చెప్పుకొచ్చారు. సీఎం ఎవరవుతారనే దానిపై  అంత ఆసక్తి అవసరం లేదని కూడా మీడియాతో ఆయన చెప్పారు. 

కర్ణాటక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్.. కొత్త సీఎంను ఎన్నుకునే పనిలో నిమగ్నమైంది. నేడు సాయంత్రం 6.00 గంటలకు జరగనున్న సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపులో కీలక పాత్ర పోషించిన సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరు సీఎం అవుతారన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. అయితే, సిద్దరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఆయనతో పాటూ పలువురు కీలక నేతలను డిప్యూటీ సీఎంగా నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వ్యాఖ్యల్లో ఆధ్యాత్మికత ధోరణి కనిపించడం ఆసక్తికరంగా మారింది.
Go Back to Shorts
DK Shivakumar
Karnataka

More Telugu News