అడిగినవన్నీ ఇచ్చేవాడ్ని దేవుడు అనరు... నాన్న అంటారు... 'విమానం' టీజర్ విడుదల
- సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ ప్రధానపాత్రల్లో 'విమానం'
- శివప్రసాద్ యానాల దర్శకత్వంలో చిత్రం
- జూన్ 9న థియేటర్లలో రిలీజ్
కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'విమానం' చిత్రం జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో మీరా జాస్మిన్, ధన్ రాజ్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, 'నాన్ కడవుళ్' రాజేంద్రన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.