జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమం
- హీత్ స్ట్రీక్ కోసం ప్రార్థించాలని జింబాబ్వే మాజీ మంత్రి సూచన
- 1993లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించిన హీత్
- 21 టెస్టులకు, 68 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన హీత్ స్ట్రీక్
1993లో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన స్ట్రీక్ 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. అతని 2005లో చివరి మ్యాచ్ ఆడాడు. 21 టెస్టులు, 68 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అవినీతికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అతనిపై ఎనిమిదేళ్ల నిషేధాన్ని విధించింది. ఈ అంశానికి సంబంధించి అతను క్షమాపణలు చెప్పాడు. అయితే ఎలాంటి ఫిక్సింగ్ లకు తాను పాల్పడలేదని స్పష్టతను ఇచ్చాడు.