హైదరాబాద్‌లో భారీ వర్షం, ఉక్కపోత నుండి నగరవాసులకు ఉపశమనం
- దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం
- రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారుల ఇబ్బంది
- పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత
ఉదయం నుండి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వర్షం కారణంగా కాస్త ఉపశమనం లభించినట్లయింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉప్పల్ క్రాస్ రోడ్డు నుండి వరంగల్ రోడ్డు దారిలో రోడ్డుపై నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.