Game Changer: చరణ్ ‘గేమ్ ఛేంజర్’ గురించి తాజా కబురు చెప్పిన శంకర్

  • నిన్న రాత్రితో క్లైమాక్స్ పూర్తయిందని వెల్లడి
  • ఇకపై ఇండియన్2 షూటింగ్ పై దృష్టి పెట్టనున్న శంకర్
  • దిల్ రాజు నిర్మాణంలో ప్యాన్ ఇండియా చిత్రంగా గేమ్ ఛేంజర్
Game Changer electrifying climax Wrapped up

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి విదితమే. ఇందులో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఓ పాత్రలో పవర్ ఫుల్ ఆఫీసర్ అని సమాచారం. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు శంకర్ తాజా అప్ డేట్ ఇచ్చారు. 

ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని తెలిపారు. అద్భుతమైన క్లైమాక్స్ చిత్రీకరణ నిన్న పూర్తయిందని చెబుతూ రాత్రిపూట షూటింగ్‌ స్పాట్ లో తీసిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ రోజు నుంచి కమలహాసన్ హీరోగా వస్తున్న ‘ఇండియన్2’ షూటింగ్ పై పూర్తి ఫోకస్ పెడతానని ట్వీట్ చేశారు. శంకర్ చేతిలో ఉన్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

More Telugu News