నల్లమల ఘాట్ రోడ్ లో బస్సు బోల్తా
- పదిమందికి గాయాలు.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు
- ఘాట్ రోడ్ లో ప్రమాదం జరగడంతో రెస్క్యూ పనులకు ఆలస్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగుండ ప్రాంతానికి చెందిన భక్తులు బస్సులో శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. నల్లమల ఘాట్ రోడ్ లో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయని, అందులో కొందరి చేతులు, కాళ్లు విరిగాయని తెలిపారు. ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు చేపట్టడంలో ఆలస్యం జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.