యూపీలో బాలికను వేధిస్తున్న కానిస్టేబుల్.. వీడియో తీసి ఫిర్యాదు చేసిన పేరెంట్స్
- స్కూలుకు వెళుతుండగా వెంటపడుతూ వేధింపులు
- తల్లిదండ్రులకు చెప్పిన బాలిక.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పేరెంట్స్
- కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
- పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు
లక్నోలోని కాంట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాదత్ అలీ కొన్ని రోజులుగా స్కూలు విద్యార్థినిని వేధిస్తున్నాడు. సైకిల్ పై వెళుతున్న బాలికను స్కూటర్ తో వెంబడిస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిఘా పెట్టి కానిస్టేబుల్ నిర్వాకాన్ని వీడియో తీశారు. దానిని ఉన్నతాధికారులకు అందజేసి, సాదత్ అలీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. సాదత్ అలీని వెంటనే సస్పెండ్ చేశారు. ఆపై పోక్సో కేసు పెట్టి అతనిని అదుపులోకి తీసుకున్నారు.