అప్పట్లో ఒక సినిమాకి నాకు ఎంత ఇచ్చేవారంటే..!: నటి వై.విజయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పట్లో ఒక సినిమాకి నాకు ఎంత ఇచ్చేవారంటే..!: నటి వై.విజయ

Y Vijaya Special
  • ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వై.విజయ
  • ఇప్పటికీ తగ్గని అవకాశాలు 
  • అప్పట్లో ఇచ్చింది కూడా పెద్దమొత్తమేనని వెల్లడి 
  • డబ్బుతో పాటు గౌరవం కూడా కోరుకుంటానని వ్యాఖ్య
తెలుగు సినిమాల్లో వై.విజయ స్థానం ప్రత్యేకం. ఒకానొక దశలో ఆమె లేని సినిమా అంటూ ఉండేది కాదు. వేరే భాషల్లో చేయాలనే ఆలోచన కూడా తనకి రానంత బిజీగా తాను ఉండేదానినని ఆమెనే చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరియర్ ను గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం వలన, ఎదుటివారిని ఎలా గౌరవించాలి? ఎంత జాగ్రత్తగా కెరియర్ ను ముందుకు తీసుకుని వెళ్లాలనేది తెలుసుకున్నాను. అప్పట్లో ఒక సినిమాకి నాకు 7500ల నుంచి, 30 వేల వరకూ ఇచ్చేవారు. అప్పట్లో అది ఎక్కువ మొత్తమే అనుకోవాలి" అన్నారు.

ఇక ఇప్పుడంటే వేషాన్ని బట్టి రోజుకి ఇంత అని ఇస్తున్నారు. డబ్బుతో పాటు నాకు గౌరవం కూడా ఉంటుందనిపించిన వేషాలను మాత్రమే ఒప్పుకుంటున్నాను. ఈ మధ్య ఇక్కడ మళ్లీ వరుస అవకాశాలు వస్తున్న కారణంగా, చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను' అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement
Y Vijaya
Actress
Tollywood

More Telugu News