యూట్యూబ్ వీడియో కోసం 300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపి దుర్మరణం పాలైన యూట్యూబర్ అగస్త్య
- మోటార్ బైక్ రేసింగ్ కోసం ఢిల్లీ వెళ్తుండగా ఘటన
- 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ప్రయత్నంలో అదుపు తప్పిన బైక్
- యమునా ఎక్స్‌ప్రెస్ వేపై డివైడర్‌ను ఢీకొట్టిన అగస్త్య
- ముక్కలైన హెల్మెట్.. తలకు తీవ్ర గాయంతో అక్కడికక్కడే మృతి
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన అగస్త్య ఢిల్లీలో జరిగే మోటార్ బైక్ రేసింగ్ పోటీ కోసం ఆగ్రా నుంచి బైక్‌పై బయలుదేరాడు. ‘ప్రొ రైడర్ 1000’ పేరుతో అగస్త్య ఓ యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్నాడు. దానికి 1.2 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రమాదానికి 16 గంటల ముందు యూట్యూబ్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఢిల్లీకి రావాలని తన స్నేహితులను అందులో కోరాడు. అగస్త్య తన చానల్‌లో వీడియోను అప్‌లోడ్ చేసిన ప్రతిసారీ డిస్‌క్లైమర్ వేసేవాడు. బైక్‌ను వేగంగా డ్రైవ్ చేయొద్దని కోరేవాడు. ఇప్పుడు అతడే అధిక వేగంతో ప్రయాణించి దుర్మరణం పాలయ్యాడు.