పాకిస్థాన్‌లో గత నెలలో 48కి పెరిగిన టెర్రరిస్ట్ దాడులు
- మార్చిలోని 39 దాడులతో పోలిస్తే ఏప్రిల్ నెలలో పెరిగిన అటాక్స్
- ఏప్రిల్ టెర్రర్ దాడుల్లో 68 మంది మృతి, 55 మందికి గాయాలు
- 41 మంది ఉగ్రవాదులను హతమార్చిన సెక్యూరిటీ సిబ్బంది
భద్రతా బలగాల మరణాలు ఏప్రిల్ నెలలో 35 శాతం పెరిగాయి. పాక్ సెక్యూరిటీ... ఉగ్రవాద సంస్థలపై తమ దాడిని పెంచినట్లు తెలిపింది. ఏప్రిల్‌లో సెక్యూరిటీ సిబ్బంది దాదాపు 41 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించింది. అలాగే 40 మందిని అరెస్ట్ చేశారని నివేదిక పేర్కొంది. ఉగ్రదాడుల్లో ఖైబర్ పఖ్తుంఖ్వా అత్యంత ప్రభావిత ప్రావిన్స్ గా మిగిలిందని, ఏప్రిల్ లో ఇక్కడే 49 శాతం నమోదయినట్లు వెల్లడించింది. కాగా, ఈ ఏడాది జనవరి నుండి పాకిస్థాన్‌లో 436 ఉగ్రవాద దాడుల్లో మొత్తం 293 మంది మరణించగా, 521 మంది గాయపడ్డారని మిలటరీ మీడియా వింగ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ గతవారం తెలిపింది.