Nadendla Manohar: పవన్, చంద్రబాబు మధ్య భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు ఉంటాయి: నాదెండ్ల మనోహర్

  • నిన్న హైదరాబాదులో చంద్రబాబు నివాసానికి పవన్
  • ఇరువురి మధ్య కీలక సమావేశం
  • రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఇరువురి భేటీ అవశ్యమన్న నాదెండ్ల
  • రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని వెల్లడి
  • వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన కృషి చేస్తుందని స్పష్టీకరణ
Nadendla Manohar says more meetings to come between Pawan Kalyan and Chandrababu

హైదరాబాదులో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్ కలవడం తెలిసిందే. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ భేటీ నేపథ్యంలో, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. 

రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఇరువురి భేటీ అవశ్యం అని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు ఉంటాయని తెలిపారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని వెల్లడించారు. 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన కృషి చేస్తుందని, తమ నినాదం కూడా అదేనని నాదెండ్ల వివరించారు. నిన్న చంద్రబాబుతో భేటీలో తమ అజెండా అదేనని వివరణ ఇచ్చారు. సరైన ప్రణాళిక, వ్యూహంతో జనసేన ముందుకు కదులుతోందని నాదెండ్ల పేర్కొన్నారు. 

సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని విమర్శించారు. విశాఖలో భూ దందాలపై జనసేన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

More Telugu News