Fans: ఎక్కడ తేడా వచ్చిందో... సన్ రైజర్స్, ఢిల్లీ మ్యాచ్ లో కొట్టుకున్న ఫ్యాన్స్... వీడియో ఇదిగో!

Brawl between fans during SRH and Delhi Capitals match
  • ఢిల్లీలో సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్
  • గెలిచిన సన్ రైజర్స్
  • మ్యాచ్ జరుగుతుండగా గ్యాలరీలో గలాటా
  • ప్రేక్షకులు మ్యాచ్ ను వదిలేసి ఫ్యాన్స్ మధ్య గొడవను చూసిన వైనం
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్యాలరీలో ప్రేక్షకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

కొందరు ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి ముష్టి యుద్ధం చేశారు. ఒకరినొకరు కింద పడదోస్తూ, పిడిగుద్దులు కురిపిస్తూ బీభత్సం సృష్టించారు. దాంతో చుట్టూ ఉన్న ఇతర ప్రేక్షకులు క్రికెట్ మ్యాచ్ ను వదిలేసి, ఈ గొడవను కోడిపందేలు చూసినట్టు చూశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Fans
Fight
Brawl
SRH
DC
Delhi
Video
IPL

More Telugu News