Advertisement

హిట్ టాక్ తెచ్చుకున్న పీఎస్2.. తొలి రోజు కలెక్షన్ ఎంతంటే..!

 Poinniyin Selvan 2 box office collection day 1
  • నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ చిత్రం
  • మొదటి రోజు ఇండియాలో రూ. 38 కోట్ల వసూళ్లు
  • మణిరత్నం కలల ప్రాజెక్టు తొలి పార్టు సూపర్ సక్సెస్ 
దిగ్గజ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పార్ట్ 1 భారీ విజయం అందుకోవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించిన ఈ చిత్రం రెండో భాగం ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో 60 శాతం ఆక్యుపెన్సీ, హిందీలో 10 శాతం, మలయాళంలో 34 శాతం, తెలుగులో 35 శాతం, కన్నడలో 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. 

ఈ చిత్రం మొదటి రోజున రూ. 38 కోట్లు వసూలు చేసింది. తమిళనాడులో రూ. 25 కోట్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో రూ. 3–4 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో మరో రూ. 4-5 కోట్లు వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. వారాంతం అయిన శని, ఆదివారాల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, పీఎస్1 భారత్ లో దాదాపు రూ. 327 కోట్లు, విదేశాల్లో రూ.169 కోట్లు వసూలు చేసింది.
Advertisement
PS2
Collections
box office
day1

More Telugu News