నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం: దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం: దిల్ రాజు

Sakunthalam is big loss for me says Dil Raju
  • డిజాస్టర్ గా నిలిచిపోయిన 'శాకుంతలం'
  • సోమ, మంగళవారాలకే కలెక్షన్లు లేవన్న దిల్ రాజు
  • దిల్ రాజులో పాటు పెట్టుబడి పెట్టిన గుణశేఖర్
సమంత ప్రధాన పాత్రను పోషించిన 'శాకుంతలం' సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై చివరకు డిజాస్టర్ గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ వద్ద కాసులను కురిపిస్తుందనుకున్న ఈ చిత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమా ఫ్లాప్ కావడంపై సమంత స్పందిస్తూ... నటించడం వరకే తన పని అని, ఫలితం తన చేతిలో లేదని చెప్పింది. దిల్ రాజు స్పందిస్తూ... తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం అని అన్నారు. సోమవారం, మంగళవారానికే కలెక్షన్లు లేవంటే ఫలితం ఏమిటో తమకు అర్థమైపోయిందని చెప్పారు. ఇంకా కలెక్షన్లు వస్తాయేమో అనే భ్రమల్లో ఉండటం వేస్ట్ అన్నారు. 

ఈ సినిమాకు దిల్ రాజుతో పాటు దర్శకుడు గుణశేఖర్ కూడా పెట్టుబడులు పెట్టారు. సమంత అందం, అభినయం, గుణశేఖర్ దర్శకత్వ ప్రతిభపై నమ్మకంతో దిల్ రాజు భారీగా పెట్టుబడులు పెట్టారు. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదని తెలుస్తోంది.
Advertisement
Dil Raju
Guna Sekhar
Sakunthalam

More Telugu News